మీ ఇంట్లోనే మీ సొంత కిట్‌ను సిద్ధం చేసుకోవడానికి, ముందు సూచించిన ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించుకోవచ్చు.

అభయ సూత్ర: పసుపు పేస్టు (పసుపులో కొద్దిగా నీళ్ళ కలిపిన మిశ్రమం) లో అద్ది తీసిన తెల్లటి కాటన్ దారాన్ని ఉపయోగించవచ్చు.

వస్త్రం: ఈ నల్ల శాలువ ప్రతిష్టీకరించిన వస్త్రం. ఇది ప్రక్రియ పట్ల మీలోని గ్రహణశీలతను పెంపొందిస్తుంది. అందుబాటులో లేకుంటే, ఈ స్టెప్పును విడిచిపెట్టండి.

భూమి: ప్రజలు ఎక్కువగా తిరగని ప్రదేశం నుండి, ఉదాహరణకు తోట లేదా మొక్కల నర్సరీ నుండి అదే పరిమాణంలో మట్టిని తీసుకోండి.

విభూతి: ఇది, శక్తివంతమైన ధ్యానలింగం వద్ద కొన్ని రోజుల పాటు ఉంచబడిన ప్రతిష్టీకరించబడిన బూడిద. స్థానిక ఈశా షాపుల్లో ఇది దొరుకుతుందేమో చెక్ చేయండి. దొరక్కపోతే, ఈ స్టెప్పుని వదిలేయచ్చు.

ధ్యానలింగ చిత్రపటం: ధ్యానలింగం సద్గురు ప్రతిష్టించిన అత్యంత విశేషమైన శక్తి రూపం, ఇది మానవులకి పరమోన్నత శ్రేయస్సును చేకూరుస్తుంది. ఈ పటం పంచభూత క్రియలో ముఖ్యమైన అంశం, మీరు ధ్యానలింగ సాన్నిధ్యాన్ని మరింత గొప్పగా యాక్సెస్ చేసుకోవడంలో సహకరిస్తుంది.

Envisioned by Sadhguru ,Project Samskriti offer programs in Indian classical arts including music, dance and kalaripayattu - a martial art form. These intricate arts have been employed for thousand of years for spiritual processes.